కన్నకూతురిపైనే కన్నేశాడో కామాంధుడు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే ఆ పిల్ల పాలిట పాపాత్ముడిగా మారాడు. ఈ హేయమైన ఘటన విశాఖపట్నం జిల్లా, మల్కాపురం ఎన్టీఆర్ కాలనీలో జరిగింది.

మానవసంబంధాలు మరిచి, వావివరసలు తుంగలోతొక్కిన ఓ పాపాత్ముడు తొమ్మిదో తరగతి చదువుతున్న తన కన్నకూతురుపైనే కన్నేశాడు ఓ తండ్రి. కొంతకాలంగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. బాలిక గర్భం దాల్చడంతో దారుణమైన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

విషయం తెలుసుకున్న స్థానికులు తండ్రికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. అమ్మాయిని హాస్పిటల్ కి పంపి చికిత్స చేయిస్తున్నారు.