తూర్పోగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సొంత అల్లుడిని మామ తల నరికి హతమార్చాడు, అనంతరం అతని తలను సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

తూర్పోగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సొంత అల్లుడిని మామ తల నరికి హతమార్చాడు, అనంతరం అతని తలను సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే.. రౌతులపూడి మండలం డిజెపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ మూర్తి కుమార్తె గతేడాది అనుమానాస్పద స్థితిలో మరణించింది. అప్పటి నుంచి ఆమె ఇద్దరు కుమార్తెలు తాతయ్య సత్యనారాయణ వద్దే ఏంటున్నారు.

అయితే గతరాత్రి అత్తగారింటికి వచ్చిన అల్లుడు మీ కూతురిని తానే చంపినట్లు మద్యం మత్తులో మామతో చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సత్యనారాయణ ఉదయం అల్లుడి తల నరికి మనవరాళ్లతో సహా అన్నవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనలో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.