రైతు సభలో ఓ తహసీల్దార్ కన్నీరు పెట్టుకున్నారు. తమకు రైతు భరోసా అందండం లేదంటూ రైతులు నిలదీయడంతో అతను సభలోనే అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఆముదాల వలసలోని పూజారిపేటలో గురువారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన స్పందన కార్యక్రమం నిర్వహంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండాల అధికారులు పాల్గొని ఆయా మండలాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పొందూరు మండలంలోని కింతలికి చెందిన 70మంది రైతులు పాల్గొని తమకు రైతు భరోసా అందండంలేదని తహసీల్దార్ రామకృష్ణను నిలదీశారు.

ఇలా తిప్పించుకోవడం వల్లనే రైతులకు కడుపు మండి అధికారులపై దాడులు చేస్తున్నారని రైతులు తహసీల్దార్ ని హెచ్చరించడం గమనార్హం. దీంతో.. ఈ ఘటనపై తహసీల్దార్ రామకృష్ణ అక్కడి నుంచి స్పీకర్ తనయుడు వెంకట చిరంజీవినాగ్ వద్దకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో... స్పీకర్ కుమారుడు రైతులతో మాట్లాడారు.

రైతులను తన వద్దకు పిలిపించుకొని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్పీకర్ మీ ససమ్యపై ఇది వరకే తహసీల్దార్ తో మాట్లాడారని.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్ని పత్రాలు అందిస్తే.. రైతు భరోసా ఇస్తారని రైతులకు నచ్చచెప్పారు. దీంతో శాంతించిన రైతులు తహసీల్దార్ కి క్షమాపణలు చెప్పారు.