వివాహేతర సంబంధం కొనసాగించడానికి వీలులేక ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో చర్చనీయాంశంగా మారింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందింది.
వివాహేతర సంబంధం కొనసాగించడానికి వీలులేక ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో చర్చనీయాంశంగా మారింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందింది.
గుంటూరు జిల్లా, కాకుమాను మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎస్.సుందర్ రాజన్ తెలిపిన వివరాల మేరకు... జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కొంత కాలం క్రితం కానీషా అనే వ్యక్తితో వివాహమైంది. గత కొంతకాలంగా యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో సునీతకు వివాహేతర బంధం ఏర్పడింది.
ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారిని మందలించారు. ఇక వారి బంధం కొనసాగించేందుకు వీలు లేకపోవటంతో తట్టుకోలేక ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాకుమాను శివారులోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు.
వారు పోలీసులకు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి సునీత మృతి చెందగా వేణుగోపాల్ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. వేణుగోపాల్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
