Asianet News TeluguAsianet News Telugu

జగన్ గుడ్ న్యూస్: డెలీవరీ అయిన మహిళలకు రూ. 5 వేల ఆర్ధిక సహాయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ... డెలీవరీ అయిన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రసవం కాగానే మహిళలకు రూ.5వేల చొప్పున సాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు

Extend Rs 5,000 Post-Delivery Aid Under Aarogya Aasara: AP CM YS Jagan
Author
Amaravathi, First Published Jul 24, 2020, 11:25 AM IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ... డెలీవరీ అయిన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రసవం కాగానే మహిళలకు రూ.5వేల చొప్పున సాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు

  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వాసుపత్రుల్లో డెలీవరి అయిన మహిళలకు కిట్ అందిస్తారు. అంతేకాదు ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగపిల్లాడు పుడితే రూ. 12 వేలు ఆర్ధిక సహాయం అందిస్తారు.

అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌పై జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేశారు. ప్రీ ప్రైమరీ 1, 2లపై ఫోకస్ పెట్టాలన్నారు. భ‌విష్య‌త్తులో అంగ‌న్‌వాడీ కార్య‌క‌లాపాల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించాల‌ని ఆయన అధికారులను ఆదేశించారు. అంగ‌న్‌వాడీల‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాల‌ని ఆయన సూచించారు

గ‌ర్భ‌వ‌తులు, బాలింత‌లు స‌హా 36 నెల‌లోపున్న శిశువుల‌ను ఒక మాదిరిగా, 36 నుంచి 72నెల‌ల వ‌ర‌కున్న చిన్నారులను మ‌రోలా చూడాల్సి ఉంటుంద‌న్నారు. అంగ‌న్‌వాడీలోని పిల్ల‌ల‌కు లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ స‌హా ప్ర‌త్యేక పుస్త‌కాల‌ను అందించాల‌ని ఆయన ఆదేశించారు. అంగ‌న్‌వాడీల్లో ఆహారం ఎక్క‌డ తిన్నా ఒకే నాణ్య‌త ఉండాలన్నారు. దీనిపై స‌మ‌గ్రంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని ఆదేశించారు. సిల‌బ‌స్‌పైనా ప్ర‌త్యేక దృష్టి పెట్టాలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios