విజయవాడలో రేపు జరగాల్సిన ఎగ్జిబిటర్ల సమావేశం (exhibitors association meeting) వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో పోలీసులు, అధికారుల తనిఖీల కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలిపింది.
విజయవాడలో రేపు జరగాల్సిన ఎగ్జిబిటర్ల సమావేశం (exhibitors association meeting) వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో పోలీసులు, అధికారుల తనిఖీల కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలిపింది. అలాగే రేపు హైకోర్టులో (ap high court) జీవో నెం 35 రద్దుపై (go no 35) విచారణతో అసోసియేషన్ పునరాలోచనలో పడింది. ఎల్లుండి సమావేశం పెట్టే అవకాశం వుంది.
మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ.. విజయనగరం జిల్లాలో ఆరు సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేసిన సంఘటన ఇప్పుడు ఏపీలో సెన్సేషన్‌గా మారింది. నిబంధనలను పాటించడం లేదంటూ.. సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ కిశోర్ కుమార్ కొరడా ఝుళిపించారు. ఆరు సినిమా హాళ్లను మూసివేయాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు.
Also Read:Theaters Seize: విజయనగరం జిల్లాలో 6 సినిమా థియేటర్లు సీజ్
వివరాల్లోకి వెళితే...విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో ఆకస్మికంగా పర్యటించి.. సినిమా థియేటర్లను అధికారులు తనిఖీ చేశారు. పూసపాటిరేగ సాయికృష్ణా థియేటర్‌ను ఆఫీసర్లు పరిశీలించారు. ఈ థియేటర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువల్ చేయకపోవడాన్ని గుర్తించి.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేటర్‌ను సీజ్ చేయాలని తాహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు.
ఇక భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్‌ను తనిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేటర్‌ను కూడా సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. నెల్లిమర్లలోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్‌లో కూడా.. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలడంతో.. హాలును అధికారులు సీజ్ చేశారు. విజయనగరం జిల్లాలోనే మొత్తం ఆరు థియేటర్లకు మూత వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ...మరిన్ని జిల్లాల్లో కూడా దాడులు జరగనున్నాయి. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా సేప్టీ నార్మ్స్ విషయంలో ముందుకు వెళ్తోంది. ఇది థియోటర్ యజమానులకు పెద్ద సమస్యగా మారనుంది.
