కాలిఫోర్నియా: మే నెల 19న ఏపీ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడిస్తానని ఆంధ్రాఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎన్నారై టీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి ఏపీలో సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడతారని స్పష్టం చేశారు. 

అభివృద్ధిలో గుజరాత్‌ను మించిపోతున్నామనే అసూయతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని లగడపాటి ధ్వజమెత్తారు.  మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తన సర్వే ఎందుకు లెక్క తప్పిందో కూడా ఆరోజే చెబుతానని స్పష్టం చేశారు. 

ఏపీలో టీడీపీ130 సీట్లకుపైగా గెలుస్తుందని, చంద్రబాబు మళ్లీ సీఎం అవడం ఖాయమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్.వీ.ఎస్ఆర్ కే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే చంద్రబాబును గెలిపిస్తాయని ఎల్వీఎస్ఆర్ కే ప్రసాద్ స్పష్టం చేశారు.