అమరావతి: ప్రజావేదిక కూల్చివేతపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక నిర్మాణాన్ని చూసి ఓర్వలేకే కూల్చివేస్తున్నారంటూ ఆరోపించారు. 

ప్రభుత్వం కక్షపూరిత చర్యలతో వెళ్తోందని ఆరోపించారు. ప్రజావేదికపై సీఎం రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రజావేదిక కూల్చివేతకు సంబంధించి జరుగుతున్న రాద్ధాంతాన్ని ప్రజలు గమనించాలని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. 

ప్రజావేదికను కూల్చివేస్తూ వైసీపీ ప్రభుత్వం పెద్ద గగనం చేస్తున్నట్లు హంగామా చేస్తోందని మరోమాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రజల సొమ్ముతో ప్రజావేదికను నిర్మించిందన్న విషయాన్ని మరచిపోతున్నారా అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చేయడం తెలుగుదేశం పార్టీపై రాజకీయ కక్షవేధింపుగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు కాల్వ శ్రీనివాసులు.