వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసందే. హేమాహేమాలు అనుకున్న నేతలంతా మట్టికరిచారు. కాంగ్రెస్ పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు.

ఇక కాం గ్రెస్ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన శైలజా నాథ్‌కు ఘోర పరాభవం పాలయ్యారు. శింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి మొన్న జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిచిన శైలజానాథ్‌కు కేవలం 1,384 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

నోటా కంటే కూడా ఇది చాలా తక్కువ. ఇక్కడ నోటాకు 2,340 ఓట్లు వచ్చాయి. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన శైలజానాథ్‌కు ఈ పరిస్ధితి రావడంతో అనంతవాసులతో పాటు కాంగ్రెస్ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.

మంత్రిగా పని చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న శైలజానాథ్ కనీసం డిపాజిట్ దక్కించుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.