Asianet News TeluguAsianet News Telugu

జగన్ మెుదటి అడుగు విజయవంతమైంది, ఇక అది కలే: నారా లోకేష్ సెటైర్లు

చంద్రబాబు హయాంలో కళకళలాడిన అమరావతి వైయస్ జగన్ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయిందంటూ ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే  కార్యాచరణలో జగన్ మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో ! అంటూ ట్వీట్ చేశారు.

ex minister nara lokesh satires on m ys jagan over amaravathi issue
Author
Amaravathi, First Published Jul 19, 2019, 6:58 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పంచ్ లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు వెనకడుగు వేయడాన్ని స్పందిస్తూ సెటైర్లు వేశారు.

జగనన్న వచ్చారు.. వరల్డ్ బ్యాంక్ పోయింది, జగన్ కల నెరవేరింది అంటూ ట్విట్టర్ వేదిగా విమర్శించారు. మెుత్తానికి అమరావతిని పడగొట్టేశారంటూ విరుచుకుపడ్డారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది అంటూ ట్వీట్ చేశారు. 

చంద్రబాబు హయాంలో కళకళలాడిన అమరావతి వైయస్ జగన్ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయిందంటూ ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే  కార్యాచరణలో జగన్ మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో ! అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు ఇంత జరిగిన తరువాత కూడా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2006 లోనే వైఎస్ అధిక వడ్డీకి మీరు ఆంధ్రాకి లోన్ ఇవ్వొద్దు అంటూ వరల్డ్ బ్యాంక్ కి లేఖ రాశారు. అందుకే ఆయనపై ఉన్న గౌరవంతో వెనక్కి వెళ్లారు అని లేఖ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదంటూ సెటైర్లు వేశారు నారా లోకేష్. 

Follow Us:
Download App:
  • android
  • ios