అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం చదువుతున్నారు. మంత్రి బడ్జెట్ పై ప్రసంగిస్తుండగానే పక్కనే కూర్చున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కునుకు తీశారు. 

ఆవిలింతలను ఆపుకోలేక అపసోపాలు పడ్డారు శ్రీకాంత్ రెడ్డి. మధ్యమధ్యలో గుర్రుపట్టి కునుక తీశారు. మంత్రి బడ్జెట్ చదువుతుండగా ప్రభుత్వ చీఫ్ విప్ నిద్రపోవడంపై నారా లోకేష్ పంచులు వేశారు. 

ట్విట్టర్ వేదికగా శ్రీకాంత్ రెడ్డి నిద్రపోవడానికి పడుతున్న అపసోపాల వీడియోను అప్ లోడ్ చేశారు. తమ ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్న విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది అంటూ సెటైర్లు వేశారు. 

 సొంత పార్టీ నేతలే గుర్రుపెట్టారంటే వైయస్ జగన్ హామీలన్నీ గుర్తుంచుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అంటూ పంచ్ లు వేశారు. మెుత్తానికి ట్విట్టర్ వేదికగా కునుకు తీస్తున్న శ్రీకాంత్ రెడ్డిపి బేస్ చేసుకుని బడ్జెట్ పై విమ ర్శలు చేశారు.