తాడేపల్లి గూడెం: మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని హెచ్చరించారు. పెంటపాడు మండలంలోని జట్లపాలెం గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి మాణిక్యాలరావు వెళ్లారు. అయితే ప్రోటోకాల్‌ ప్రకారం అక్కడి రెవెన్యూ అధికారులు, గ్రామ నాయకులు హాజరుకాకపోవడంతో వారిపై విరుచుకపడ్డారు. 

కావాలనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఇదంతా చేయిస్తున్నారని ఆ ఊబిలో అధికారులు ఇరుక్కోవద్దని హితవు పలికారు. అధికారులంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఖబర్దార్‌ అంటూ హెచ్చరించారు. ప్రజలంతా కలిసి అధికారులను నిలదీయాలని, వారి ఆఫీసుల నుంచి బయటకు రాకుండా చేయాలంటూ  ప్రజలకు పిలుపునిచ్చారు.