బీజేపీ సీనియర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్‌పై టీడీపీ నేత, మాజీ కేఎస్ జవహర్ మండిపడ్డారు. వెన్నుపోటు అంటే ఏంటో బీజేపీ సీనియర్ నేత అద్వానీని అడుగు వెన్నుపోటు కి అసలు నిర్వచనం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన బీజేపీ సీనియర్ల తో మాట్లాడితే వెన్నుపోటు అంటే ఏంటో తెలుస్తుందని జవహర్ సూచించారు. పార్టీ ని కాపాడుకొని వేలాది మంది నాయకులు,లక్షల మంది కార్యకర్తలకు భవిష్యత్తు ఇచ్చిన వాడిని రక్షకుడు అంటారని దియోధర్‌కు సూచించారు.

ప్రత్యేక హోదా ఇస్తా అని పార్లమెంట్ లో హామీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుని తడి గుడ్డతో కోసారే అది వెన్నుపోటు అంటూ జవహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని శంకుస్థాపన కి వచ్చి ఢిల్లీ ని తలపించే రాజధాని నిర్మిస్తామన్నారు.. కానీ ఇప్పుడు మూడు ముక్కల రాజధానికి జై కొడుతున్నారని దానిని వెన్నుపోటు అంటారని చెప్పారు.

అవినీతి లేకుండా చేస్తాం అంటూ 43 వేల కోట్లు కొట్టేసి జైలుకెళ్లిన పార్టీతో జతకట్టారని.. మీ పార్టీకి ఏం గతి పడుతుందో అంచనా వేసుకోవాలని జవహర్ వ్యాఖ్యానించారు.