Asianet News TeluguAsianet News Telugu

Kodali Nani : "ఆమెకు రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా?"

బీజేపీ చీఫ్ పురందేశ్వరీపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురేందేశ్వరీ పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Ex Minister Kodali Nani Satirical Comments On BJP Purandeswari krj
Author
First Published Nov 4, 2023, 6:24 PM IST

టీడీపీ అధినేత అరెస్టు అనంతరం ఏపీ రాజకీయాలు వేడేక్కాయి. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరీపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఇంతకీ పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా? అని నిలదీశారు. నేడు పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల ప్రసార సాధనాల్లో హడావుడి చేస్తున్నారనీ , ఆమె లేఖలను భయపడేవారు, బెదిరిపోయే వాళ్లు  ఎవరూ  లేరని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గారి వదిన (పురేందేశ్వరీ)ని బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కక్ష సాధింపుగా జగన్ మీద, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసుల్ని నేడు కాకపోతే రేపు ఏ న్యాయస్థానంలోనైనా రాజకీయ కేసులే తప్ప, ఎలాంటి అధికార దుర్వినియోగంగానీ, అవినీతిగానీ జరగలేదని నిర్థారించబడుతాయని అన్నారు.  కాబట్టి కేసులపై హడావుడి చేసినంతమాత్రాన, ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరూ లేరని  విమర్శించారు.  
 
ఇంతకీ పురంధేశ్వరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా? లేక తెలుగుదేశం పార్టీలో ఉందా? అన్నది తేల్చుకోవాలని అన్నారు.  ఎందుకంటే.. ఆమె బీజేపీలో ఉన్నట్టు ఎక్కడా కనిపించడంలేదని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలోకి దిగకపోవడంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరానని మండిపడ్డారు. కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్ తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్ తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా.. పురంధేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో  పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నట్టా..? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలని సూచించారు. 

పురేందేశ్వరీ గతాన్ని చూస్తే.. టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందనీ, కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చిందని విమర్శించారు. ఆ తర్వాత బీజేపీలో చేరినా, బాబు ఆదేశాల మేరకు.. బాబు ప్రయోజనాల కోసమే చేరిందని అన్నారు. దీన్ని బట్టి పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా? అనేది తేల్చుకోవాలని అన్నారు.  కాంగ్రెస్ లో ఉన్నా రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్నా పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, చంద్రబాబు బృందం ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు దూకుతున్నారనీ, వీరి రాజకీయం చంద్రబాబు కోసం కాదా అని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios