మాజీ మంత్రి దేవినేని ఉమా హౌస్ అరెస్ట్.. విజయవాడలో ఉద్రిక్తత...

టీడీపీ చేపట్టిన దళిత గర్జన నేపథ్యంలో మాజీమంత్రి దేవినేని ఉమను పోలీసులు విజయవాడలో హౌజ్ అరెస్ట్ చేశారు.

Ex minister Devineni Uma house arrest in vijayawada

విజయవాడ : మాజీ మంత్రి దేవినేని ఉమాను ఏపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో  విజయవాడలో దళిత గర్జనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలకు నిరసనగా ఈ గర్జనకు టీడీపీ పిలుపునిచ్చింది. వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన కోసం టిడిపి ఎస్‌సిసెల్‌ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌.రాజు ఆధ్వర్యంలో దళిత గర్జన జరుగుతుంది. 

ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసలు మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఉమా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై దాడులు నిత్వకృత్యమయ్యాయన్నారు. మూడేళ్ళ పాలనలో జగన్‌ ఎస్సీలకు మొండి చేయి చూపించారన్నారు. దళితుల కోసం కేటాయించిన వేలకోట్ల సబ్‌ప్లాన్‌ నిధులను వైసీపీ పాలకులు దారి మళ్లించారని మండిపడ్డారు.

రివర్స్ టెండరింగ్ డ్రామా వల్లే పోలవరం నిర్మాణం సంకనాకింది.. దేవినేని ఉమ

తిరిగి ఆనిధులన్నింటినీ రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలి. నిలిపివేసిన బ్యాంకు లింకేజీ రుణాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల కోసం గతంలో అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దళిత బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు అమలు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌, అంబేడ్కర్‌ విద్యా స్కీంలను జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది. NFSKFDC ద్వారా కేంద్రం ఇచ్చే పథకాలన్నింటినీ కాలరాసిందన్నారు.

దళితులంతా చైతన్యవంతులై జగన్ సర్కార్ పై సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. అయితే నేడు తలపెట్టిన టీడీపీ ఎస్సి సెల్ దళిత గర్జన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు,దళితులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.  దళిత గర్జన కు వస్తున్న దళితులను ఎక్కడికి అక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios