విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు. రౌడీయిజం జగన్ బ్లడ్‌లోనే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అలాగే పోలీసు వ్యవస్థలోనూ రౌడీయిజం పెరిగిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటిని చూస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ మౌనం వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

విశాఖపట్నం స్నేహపూర్వక ప్రదేశం అని చెప్పుకొచ్చిన అయ్యన్నపాత్రుడు కడప సంస్కృతి ఇక్కడకు తీసుకురావొద్దని సూచించారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. 

జగన్ పాలన చూస్తుంటే పెన్షన్లు మినహా అన్నీ రద్దు చేయడమే పనిగా పెట్టుకున్నారని అనిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఫర్నిచర్ దొంగతనం అంటగట్టి కోడెల శివప్రసాద్‌ను మానసిక క్షోభకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ నిప్పులు చెరిగారు.