విశాఖపట్నం: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కీలక సూచలను చేశారు.  విశాఖపట్నంను టూరిజం హబ్ గా మార్చాల్సిన బాధ్యత అవంతి శ్రీనివాస్ దేనని చెప్పుకొచ్చారు. 

విశాఖపట్నం జిల్లా కేడీపేట అల్లూరి సీతారామరాజు పార్క్‌లో అల్లూరి, గంటందొర సమాధులకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు సమాధులు ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ ను కోరారు. 

అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులు ఉన్న ప్రాంతాన్ని సుందరీకరించి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని అందులో భాగంగా గతంలో తాను ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు. అయితే తాము అధికారం కోల్పోవడంతో  ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ దాన్ని అభివృద్ధి చేయాలని అయ్యన్న పాత్రుడు కోరారు.