నారా లోకేష్ యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పాదయాత్రతో టీడీపీకి వున్న కాస్త పరువు కూడా పోతోందని.. లోకేష్ దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పగలరా అని అనిల్ కుమార్ సవాల్ విసిరారు.  

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులకేశి లోకేష్ ఒక మాలోకమని, ఆయన పాదయాత్ర జనాలు లేక వెలవెలబోతోందన్నారు. లోకేష్ దెబ్బకు ఆ పార్టీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయని.. పాదయాత్రతో టీడీపీకి వున్న కాస్త పరువు కూడా పోతోందని అనిల్ కుమార్ దుయ్యబట్టారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌ను రాష్ట్ర స్థాయి నాయకుడిగా చేశారని ఆయన ఫైర్ అయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

175 స్థానాల్లో పోటీ చేస్తామని జగన్ చెప్పారని.. మరి లోకేష్ దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పగలరా అని అనిల్ కుమార్ సవాల్ విసిరారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ముందుకు వెళ్లరని.. జగన్ మాత్రం సింహంలా, సింగిల్‌గా వస్తారని ఆయన ప్రశంసించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని అనిల్ కుమార్ జోస్యం చెప్పారు. విద్యా వ్యవస్థలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని.. టీచర్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ వైపే వున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులను జనంలోకి పంపగల దమ్ము ఒక్క జగన్‌కే వుందని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 

Also REad: పవన్ గురించి అడిగి నన్ను అవమానించొద్దు.. సీఎం జగన్ సవాలు ఆయనకు కాదు: మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు..

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గురించి అడిగి తనను అవమానించొద్దని అన్నారు. రెండు సార్లు ఎన్నికల్లో గెలిచిన తనను.. రెండు చోట్ల ఓడిన పవన్ గురించి అడగొద్దని చెప్పారు. అదే విధంగా సీఎం జగన్‌ సవాలుపై స్పందించిన మంత్రి కాకాణి.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా? అని జగన్ చంద్రబాబును అడిగారని అన్నారు. అంతేగానీ పవన్ కల్యాణ్‌ను అడగలేదని చెప్పారు. పవన్ పార్టీని తాము గుర్తించడం లేదని.. ఆయన స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వేర్వేరుగా ఉండవని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో కలిపే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని చెప్పారు. పీఎం కిసాన్‌తో కలిసి వైఎస్సార్ రైతు భరోసా ఇస్తున్నామని తమ ప్రభుత్వం పదే పదే చెబుతుందని అన్నారు. 

ఇక, మంగళవారం రోజున గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాలు విసిరారు. ‘‘మీకు అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? నేను చేస్తాను. అన్ని సీట్లు గెలుస్తానన్న నమ్మకం ఉంది. వాళ్లకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే జీవితంలో వారు ఏ రోజు కూడా మంచి చేయలేదు. కానీ మీ బిడ్డకు ధైర్యం ఉంది.. కారణం మేం మంచి చేశాం. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. మల్లి గెలుస్తామనే నమ్మకం ఉంది’’ అని జగన్ అన్నారు