వైసీపీ నేతలు ఇప్పటికే వాళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామని...  చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది.

 ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అధికార పక్ష నేతలు చేసిన ప్రసంగాల్లో ఒక్క పాయింట్ కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే పాయింట్ లేదని ఎద్దేవా చేశారు. 

‘‘మీ సభ్యులందరూ కూడా మేమేదో అధికారంలో ఉన్నట్లు.. మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్లు భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. కొద్దిగా మారండి. మీరు అధికారంలోకి వచ్చారు. ఏదో మా నాయకుడు చంద్రబాబు నాయుడుగారే రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా.. మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు సమర్థవంతమైన పాలన అందించామని నూటికి నూరు శాతం చెబుతున్నాం.’’ అని అచ్చెన్నాయుడు ప్రసంగించారు.