Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై చేయి చేసుకోబోయిన చెన్నారెడ్డి: నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో అప్పటి మాజీ సీఎం చెన్నారెడ్డి.. చంద్రబాబుపై చేయి చేసుకోబోయారంటూ వ్యాఖ్యానించారు. 

EX CM Nadendla Bhaskararao sensational comments on chandrababu naidu
Author
Annavaram, First Published Jan 29, 2019, 8:29 AM IST

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో అప్పటి మాజీ సీఎం చెన్నారెడ్డి.. చంద్రబాబుపై చేయి చేసుకోబోయారంటూ వ్యాఖ్యానించారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన నాటి సంఘటనను గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నట్లు సీఎం చెన్నారెడ్డికి తెలిసిందని..

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బాబును తన దగ్గరకి పిలిపించుకున్నారన్నారు. వెంటనే తన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబును కొట్టబోయారని నాదెండ్ల తెలిపారు. అయితే చంద్రబాబును అందరిలో ఎందుకు కొట్టబోయారో తెలియక తాను తర్వాత ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లి అడిగానన్నారు.  

అప్పుడు ‘‘పార్టీలో ముఠాలు కడుతున్నాడు చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి’’ చెన్నారెడ్డి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో చంద్రబాబు దొంగతనం చేసినట్లు నాదెండ్ల కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలిపారు. దీనిపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా అదంతా నిజమేనన్నారు.

అలాగే ఇటీవల ఎన్టీఆర్‌పై చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, వాటన్నింటికీ తాను కట్టుబడి ఉంటానని భాస్కరరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని తానేనని, పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు తన మంత్రి పదవిని ఎన్‌టీఆర్ తీసేస్తే ఆయన ముఖ్యమంత్రి పదవిని తాను తీసేశానని తెలిపారు.

వెన్నుపోటు అంటూ ఈ విషయంలో తనపై 30 ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దును సమర్థించింది, రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబేనన్నారు.

ఇప్పుడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని అంటున్నది ఆయనేనని భాస్కరరావు మండిపడ్డారు. తనను విలన్‌గా చూపిస్తూ ఎవరు సినిమా తీసినా న్యాయపరమైన విచారణకు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios