ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నాక్యాంటీన్ల మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో క్యాంటీన్లు మళ్లీ తెరిచే వరకు ఉద్యమం చేస్తామంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. టీడీపీపై కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయవచ్చని భావిస్తోందంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలను కష్ట పెట్టడాన్ని చూసి టీడీపీ సహించలేకపోతోందన్నారు.
 
‘‘తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది టీడీపీ. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో  చూడాలి.

ఇదిలా ఉండగా... జులై 31వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లంటినీ వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ ీఅన్నా క్యాంటీన్లలో అవినీతి ఎక్కువగా జరిగిందనేది వైసీపీ నేతల వాదన. అయితే... వీటిని మూసివేయంతో తమకు అన్నం లభించడం లేదని పేదలు.. పని లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు.