ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ పొరపాటు చేస్తున్నాడని... తన చెట్టుని తానే నరుక్కుంటున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం విషయంలో విజయసాయి సీబీఐ ఎంక్వైరీ కోరితే... కేంద్ర మంత్రి అవసరం లేదని చెప్పారని గుర్తు  చేశారు.పునరావాసంలో అవకతవకల గురించి జీవీఎల్ ప్రస్తావిస్తే.. పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడిగారని తెలిపారు.
 
వాళ్లల్లోనే వాళ్లకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదన్నారు. ఆర్అండ్ఆర్ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. వైసీపీ మాట్లాడటం లేదన్నారు. కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారని.. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగ పడలేదని.. గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్టు వైసీపీ మాట్లాడుతోందని పేర్కొన్నారు.