విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో భారీగా ఉద్యోగుల అంతర్గత బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 

విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో భారీగా ఉద్యోగుల అంతర్గత బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 170 మందిని ఆలయ సిబ్బందిని.. ఒక విభాగం నుంచి మరో విభాగానికి బదిలీ చేశారు. బదిలీ అయినవారిలో ఏఈవోలు, సూపరింటెండెంట్‌లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది ఉన్నారు. షిఫ్ట్‌ డ్యూటీల్లోనూ మార్పులు చేర్పులు చేశారు. అయితే కొందరు చాలా కాలంగా ఒకే పోస్టులో కొనసాగుతున్న వారిని బదిలీ చేయకపోవడపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ బదిలీలపై కొందరు ఉద్యోగులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటెండర్లు, స్వీపర్లు చేసే పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్లకి విధులు కేటాయించారని కొందరు చెబుతున్నారు. మరికొందరు కూడా బదిలీలపై ఇదే రకమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బదిలీలపై కొందరు ఉద్యోగులు దేవాదాయ కమిషనరుకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది.