ఆంధ్ర ప్రదేశ్ లోని ముఖ్యమైన నగరాల్లో ఏలూరు ఒకటి. ఇది జిల్లా కేంద్రమే కాదు అసెంబ్లీ నియోజకవర్గం కూడా. ఏలూరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని కొనసాగుతున్నారు. ఈసారి ఏలూరులో అధికార వైసిపి, ప్రతిపక్ష కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది...  కాబట్టి   ఈ అసెంబ్లీలో గెలుపెవరిదన్నది ఆసక్తిరంగా మారింది. 

ఏలూరు రాజకీయాలు : 

ఏలూరు అసెంబ్లీపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది.పార్టీ ఏర్పాటుతర్వాత ఐదుసార్లు టిడిపి, నాలుగుసార్లు ఇతరపార్టీలు ఏలూరులో గెలిచాయి. అందులో మూడుసార్లు టిడిపిని ఓడించింది ఆళ్ల నానియే (రెండుసార్లు కాంగ్రెస్, మరోసారి వైసిపి నుండి పోటీచేసి). 2019లో వైసిపి తరపున ఏలూరు బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన నాని జగన్ కేబినెట్ లో కీలకమై డిప్యూటీ సీఎం పదవిని పొందాడు. 

ఇదిలావుంటే 1983లో టిడిపి తరపున మొదటిసారి ఏలూరులో పోటీచేసి గెలిచారు చెన్నకేశవులు రంగారావు. ఆ తర్వాత 1985, 1994 లొ మరదాని రంగారావు, 1999 అంబికా కృష్ణ, 2014 లో బడేటి బుజ్జి (కోట రామారావు)ఏలూరు ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 

ఏలూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :

1. ఏలూరు మండలం 
2. ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 50వ వార్డు వరకు 

ఏలూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,38,903
పురుషులు - 1,14,045
మహిళలు ‌- 1,24,820

ఏలూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) మరోసారి ఏలూరులో పోటీ చేస్తున్నారు. ఏలూరు వైసిపిలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న నాని మరోసారి విజయంపై ధీమాతో వున్నాడు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ ఏలూరు బరిలో బడేటి రాధాకృష్ణను దింపుతోంది. ఆళ్ల నానిని సమర్ధవతంగా ఎదుర్కోగలడన్న నమ్మకంతో రాధాకృష్ణకు అవకాశం ఇచ్చింది టిడిపి.

ఏలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఏలూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,59,680 (66 శాతం) 

వైసిపి - ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) - 72,247 ఓట్లు (44 శాతం) - 4,072 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - బడేటి కోట రామారావు - 68,175 (42 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - అప్పలనాయుడు రెడ్డి - 16,681 (10 శాతం)

ఏలూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,48,133 (71 శాతం)

టిడిపి - బడేటి కోట రామారావు - 82,483 (55 శాతం) ‌- 24,603 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - ఆళ్ల నాని - 57,880 (39 శాతం) - ఓటమి