సున్నిత ప్రాంతాలు, సమత్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై సీఈసీ సమీక్ష నిర్వహిస్తోంది. చెక్ పోస్ట్ లు ఎన్నికల తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరాతీస్తోంది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ లో ఎన్నికలు జరగడానికి అంతా సిద్ధమైనట్లుగా సీఈసీ సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. శుక్రవారం మొదటిరోజు 18 జిల్లాలలో సమీక్షలు జరిగాయి. శనివారం నాడు 8 జిల్లాలలో సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే సీఈసీ ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు ఉండబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లుగా సమాచారం. ఈసీ బృందం శనివారం నాడు నంద్యాల, కర్నూలు సత్యసాయి, అనంతపురం, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయింది. 

ఈ సమావేశంలో సున్నిత ప్రాంతాలు, సమత్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై సమీక్ష నిర్వహిస్తోంది. చెక్ పోస్ట్ లు ఎన్నికల తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరాతీస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని కేంద్ర బృందం సీఈఓ కు సూచనలు ఇవ్వబోనుంది. శుక్రవారం నాడు జరిగిన సమావేశం అనంతరం ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్ గా తీసుకుంటామని సీఈసీ బృందం హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు సిఎస్ డీజీపీలతో సిఇసి బృందం భేటీ అవ్వబోతోంది.