సీఎం జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నేపత్యంలో తిరుపతి పార్లమెంట్ ఓటర్లకు జగన్ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని, 24 గంటల్లో కరోనాతో మరణించిన 11 మందిలో.. నలుగురు  చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. 

అంతేకాదు చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడ ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు. ఇవాళ కరోనా బులెటిన్ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నానన్నారు. 

మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది.. అని లేఖలో రాశారు. బాధ్యతగల సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నారని, ఇటీవల తాను మీకు రాసిన లేఖలో సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. వాటిని గమనించి తన సోదరుడు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

జగన్ లేఖలాపి లెక్క చెప్పాలి.. మండిపడ్డ జవహర్...

ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, రాయచోటీ వైసీపీ నేత రాంప్రసాద్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని కలిశారు.

ఆయన త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశాలు వున్నాయని సమాచారం. ప్రస్తుతం కడప జిల్లా వైసీపీలో చంద్రబాబు, రాం ప్రసాద్ రెడ్డి కలయిక హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నెల 14వ తేదీన తెలుగుదేశం పార్టీలో ఆయన చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే , సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపులో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని కడప జిల్లాలో టాక్.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని మండిపల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా తనను కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ, అసంతృప్తికి లోనైన రాంప్రసాద్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే మండిపల్లి నిర్ణయంపై స్థానిక వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి,