ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించి, శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం ద్వివేది మాట్లాడుతూ.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యిందన్నారు.

పోలింగ్ శాతం నమోదులో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో ఉందని ద్వివేది తెలిపారు. మహిళలు, వికలాంగులు, పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయన్నారు. ఈవీఎంల మొరాయింపులు రెండు శాతంకు మించి లేవని సీఈవో పేర్కొన్నారు.