Janasena: జనసేనకు ఎన్నికల సంఘం షాక్.. ఫ్రీ సింబల్ గా గాజు గ్లాసు గుర్తు..
Janasena: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి, ప్రతిపక్ష కూటమికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
Janasena: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి, ప్రతిపక్ష కూటమికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఉన్నాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలకు గుర్తింపు వచ్చింది. కానీ, జనసేన రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే పేర్కొంది. ఈ గ్లాస్ సింబల్ ను ఉచిత సింబల్ జాబితాలో చేర్చింది. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఖచ్చితమైన గుర్తు ఉంటుంది. ఇది జనసేనను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణల సలహా తీసుకోవాలని భావిస్తోంది.
ఇలాంటి సమయంలో గుర్తు మారితే ప్రజల్లో అయోమయం మొదలవుతుందని జనసేన పార్టీ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘంతో పార్టీ లీగల్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కాగా, ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని జనసేన పార్టీ చెబుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేనకు ఉమ్మడి గుర్తును కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు కూడా కమిషన్ తిరస్కరించే అవకాశం లేదు. జనసేనకు తన సీట్లలో గుర్తు వస్తుందా అని మీడియా మాట్లాడుతుండగా, అసలు సమస్య వేరేలా ఉంది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ గా చేర్చడంతో .. టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాల్లోనే కాదు.. జనసేన పోటీ చేసే స్థానాల్లో కూడా కొత్త తలనొప్పులు సృష్టించే అవకాశం ఉంది.