తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారం తరలింపు వ్యవహారంలో టీటీడీకి ఎన్నికల సంఘం క్లీన్‌చీట్ ఇచ్చింది. ఈ విషయంలో పంజాబ్ నేషలన్ బ్యాంక్ తప్పు లేదని ఈసీ తేల్చింది.

ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యానే బంగారాన్ని సీజ్ చేశామని తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కిందిస్థాయి సిబ్బంది బంగారాన్ని సీజ్ చేశారని ఆయన తెలిపారు. రా

ష్ట్రంలో ఎన్నికల ముందు రోజు కావడంతో బంగారాన్ని సీజ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, ఐటీ శాఖ అధికారులతో తనిఖీలు నిర్వహించామన్నారు. అన్ని పత్రాలు సరిచూసుకుని బంగారాన్ని విడుదల చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.