ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మంగళగిరిలోని ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా ఈడీ ప్రకటన విడుదల చేసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మంగళగిరిలోని ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్ అభ్యర్థుల నుంచి అందిన నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలపై ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ఆఫీస్ బేరర్లపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిందని ఈడీ బుధవారం తెలిపింది. ఎన్నారై అకాడమీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొంది. డిసెంబర్ 2,3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో సోదాలు జరిపినట్టుగా గుర్తుచేసింది. 

ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే విచారణ చేపట్టినట్టుగా వెల్లడించింది. ఆ ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. సొసైటీ నిధులను అకాడమీ దారి మళ్లించిందని ఆరోపించారు. కొందరు సొసైటీ సభ్యులు భవనాల నిర్మాణం పేరుతో కోవిడ్‌ రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాల కోసం వైద్య విద్యార్థుల నుంచి ఈ సంస్థ పెద్ద మొత్తంలో డబ్బును వసూలు చేసి.. మరో అకౌంట్‌కు బదిలీ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 

ఈ క్రమంలోనే ఈడీ సోదాలు చేపట్టింది. ‘‘మనీలాండరింగ్‌లో ప్రమేయం ఉన్నట్లు అనుమానించబడిన స్థిరాస్తుల 53 పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. వాటిని స్తంభింపజేశాం.ల మళ్లింపుతో సంబంధం ఉన్న అనేక ఇతర నేరారోపణ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నాం’’అని ఈడీ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొంది.