Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఏ రోజున ఏ అలంకారమంటే..?

అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు జరగనున్నాయి . దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం అధికారులు, పాలకమండలి సభ్యులు సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణకు రూ.7 కోట్లు కేటాయించామని, 9 రోజుల పాటు అంతరాలయ దర్శనం వుండదని ఈవో స్పష్టం చేశారు. 

Dussehra navaratri from october 15 to 23th in Indrakeeladri ksp
Author
First Published Sep 19, 2023, 5:07 PM IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం అధికారులు, పాలకమండలి సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ విధుల్లో ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఉత్సవాలు జరిగే పది రోజుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరికొంతమంది సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు రాంబాబు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. 

ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల సమయంలో వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. భక్తులు వేచి వుండేప ప్రదేశాలను గుర్తించి షెడ్లను వేస్తున్నామని, స్నానాలకు షవర్లు ఏర్పాటు చేస్తున్నామని ఈవో వెల్లడించారు. పది ప్రసాదం కౌంటర్లు వుంటాయని.. మోడల్ గెస్ట్‌హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్‌ల వద్ద కూడా ప్రసాద విక్రయాలు జరుగుతాయని భ్రమరాంబ చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు రూ.7 కోట్లు కేటాయించామని, 9 రోజుల పాటు అంతరాలయ దర్శనం వుండదని ఈవో స్పష్టం చేశారు. 

ఏ రోజున ఏ అలంకారం అంటే :

  • అక్టోబర్‌ 15 - బాలా త్రిపురసుందరి
  • అక్టోబరు 16 - గాయత్రీ దేవి
  • అక్టోబరు 17 - అన్నపూర్ణ దేవి
  • అక్టోబరు 18 - మహాలక్ష్మి 
  • అక్టోబరు 19 - మహాచండీ
  • అక్టోబరు 20 - సరస్వతి
  • అక్టోబరు 21 - లలితా త్రిపుర సుందరి
  • అక్టోబరు 22 - దుర్గాదేవి
  • అక్టోబరు 23 - మహిషాసుర మర్దిని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి
     
Follow Us:
Download App:
  • android
  • ios