విజయవాడ:విజయవాడ పట్టణంలోని కనకదుర్గవారధి పై నుండి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి దూకి సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యను తన సోదరుడి కొడుకుతో వీడియో తీయించుకొన్నాడు.

గుంటూరు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ కనకదుర్గవారధిపై నుండి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా నదిపై పూజలు చేసుకొంటానని ఇంట్లో చెప్పి కనకదుర్గ వారధి వద్దకు వచ్చాడు. తన సోదరుడి కొడుకు సుజిత్ ను కూడ వెంట తీసుకొచ్చాడు.

కనకదుర్గ వారధిపై నుండి పూలు చల్లి పూజలు చేస్తున్నట్టుగా నటించాడు. ఆ తర్వాత వారధి పై నుండి నదిలో దూకాడు.ఈ దృశ్యాలను రికార్డు చేసిన సుజిత్ షాక్ కు గురయ్యాడు. దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాడు. 

అనారోగ్యంతోనే  తాను ఆత్మహత్య చేసుకొంటున్నానని  ఆయన సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.  ఈ విషయాన్ని సుజిత్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గాప్రసాద్  ఆచూకీ ఇంకా దొరకలేదు. దుర్గాప్రసాద్ కు ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.