దుర్గను ప్రొద్దుటూరు నుంచి పోలీసులు గన్నవరం తీసుకుని వచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు.
విజయవాడ: దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. కువైట్ నుంచి వచ్చిన దుర్గ ఈ నెల 16వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ఆమె కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉన్నట్లు గుర్తించారు.
దుర్గను ప్రొద్దుటూరు నుంచి పోలీసులు గన్నవరం తీసుకుని వచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. తమకు వచ్చిన కంప్లంట్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆఛూకీ తెలుసుకొని ఇక్కడి నుండి కడప వెళ్లి దుర్గని తీసుకువచ్చి భార్య భర్తలకు కౌన్స్లింగ్ ఇచ్చి ఇంటికి పంపామని సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా దుర్గ విమానాశ్రయం నుండి కడపకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలిపారు. ''ఈ నెల 16వ తారీకున కువైట్ నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నాను. నేను వచ్చే రెండు రోజులముందు నుండి భర్తతో ఫోన్ లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాకు భయం వేసి ఎక్కడికి వెళ్లాలో తెలియక కడపలో నివాసం ఉంటున్న నా చెల్లివద్దకు వెళ్ళాను. ఈ రోజు పొద్దున్నే పోలీసులు కడప నుండి నన్ను తీసుకువచ్చి నాతో పాటు నా భర్తకు కౌన్స్లింగ్ ఇచ్చి ఇంటికి వెల్లమన్నారు'' అని తెలిపారు.
వీడియో
ఈ నెల 16వ తేదీన గన్నవరం విమాశ్రయంలో దిగిన దుర్గ ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దుర్గ విమానాశ్రయంలో దిగి పార్కింగ్ కు వెళ్లే దాకా దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆమె ఎటు వెళ్లిందనే విషయం తేలలేదు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఝానాన్ని ఉపయోగించి ఆమెను కనిపెట్టే పనికి పూనుకున్నానారు.
కువైట్ నుంచి వచ్చిన దుర్గ స్నేహితురాలు ఈ నెల 17వ తేదీన ఫోన్ చేసిందని, దాంతో దుర్గ ఇక్కడికి వచ్చినట్లు తనకు తెలిసిందని, అంత వరకు ఆమె రాక గురించి తనకు తెలియదని సత్యనారాయణ పోలీసులకు వివరించాడు. కరోనా పరీక్షలు పూర్తయిన తర్వాత బయలుదేరే ముందు ఫోన్ చేస్తానని చెప్పిందని, అయితే ఆమె తనకు ఫోన్ చేయలేదని చెప్పాడు.
దుర్గ చాలా కాలంగా కువైట్ లో పనిచేస్తోంది. అక్కడ పనిచేస్తున్న క్రమంలో రెండు సార్లు ఇక్కడికి వచ్చి తిరిగి ెవళ్లింది. వంట పనులు, ఇంటి పనులు చేసేదని సత్యనారాయణ చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2020, 9:55 AM IST