నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న డీఎస్సీ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్‌ను ప్రకటించారు.

రేపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని.. మొత్తం 7,675 టీచర్ పోస్టులకు రేపు నోటీఫికేషన్ విడుదవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిని 49 ఏళ్లకు పెంచుతున్నామని.. జనగర్ కేటగిరి అభ్యర్థులకు 44 ఏళ్లకు పెంచుతున్నట్లుగా గంటా వెల్లడించారు. అనేక సాంకేతిక కారణాల వల్ల డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమవుతూ వచ్చిందన్నారు. ఏపీలో టెట్ కం టీఆర్‌టీ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

డీఎస్సీ నోటీఫికేషన్‌లో ముఖ్యమైన తేదీలు:

* నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
* నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు
* డిసెంబర్‌ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్ష
* డిసెంబర్‌ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ రాత పరీక్ష
* డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాత పరీక్ష
* డిసెంబర్‌ 17 పీఈటీ, మ్యూజిట్‌, క్రాప్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్ రాత పరీక్ష