Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో దారుణం... కన్నతల్లిని రోకలిబండతో కొట్టిచంపిన కసాయి కొడుకు (వీడియో)

మద్యంమత్తులో మానవత్వాన్నేకాదు కనిపెంచిన తల్లిపై మమకారాన్ని కూడా మరిచిన ఓ కసాయి కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. కాసుల కోసం కన్నతల్లినే అత్యంత కర్కశంగా కొట్టిచంపాడు. 

Drunken son kills his own mother at guntur district
Author
Guntur, First Published Dec 2, 2021, 4:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: నవమాసాలు కడుపున మోసి ప్రాణంపోసిన కన్నతల్లి ప్రాణాలనే తీసాడు ఓ కసాయి కొడుకు. మద్యంమత్తులో విచక్షణను కోల్పోయిన కొడుకు రోకలిబండతో అత్యంత దారుణంగా దాడిచేయడంతో తల్లి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. guntur district కాకుమాను మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఈమని ప్రభాకర్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. పనీపాట లేకుండా నిత్యం మద్యంమత్తులోనే తూలుతూ వుండేవాడు. అయితే తాగడానికి డబ్బులు లేకపోతే వృద్దురాలయిన తల్లి సీతామహాలక్ష్మిని వేదించేవాడు. ఇలా వయసు మీదపడ్డా కాయకష్టం చేసి తల్లి సంపాదిస్తుంటే కొడుకు తాగితందనాలాడుతూ జల్సాలు చేసేవాడు. 

వీడియో

అయితే తాజాగా తాగడానికి డబ్బులు ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి తల్లిని అడిగాడు. అయితే తల్లి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అప్పటికే మద్యంమత్తులో వున్న అతడు విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో తల్లీపై దాడికి తెగబడ్డారు. ఇంట్లోని రోకలిబండతో తల్లి తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. 

read more   పులివెందులలో మహిళ దారుణ హత్య : నాతో కాకుండా నీ భర్తతో ఉంటావా.. ప్రేమికుడి దారుణం...

ఈ దారుణం గురించి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వెంటనే పోస్టుమార్టం నిమిత్తం వ‌ృద్దురాలి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు ప్రభాకర్ రెడ్డి పరారీలో వున్నాడని... అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

క్రికెట్ బ్యాట్ తో కొట్టి తల్లిని చంపిన మరోదారుణం

ఇలాంటి దారుణమే ఇటీవల కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలంటూ తల్లితో గొడవపడ్డ తనయుడు ఆవేశంలో క్రికెట్ బ్యాట్ తో దాడిచేసి హతమార్చాడు. ఈ దారుణం మచిలీపట్నం పరాస్ పేటలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. 

చింతరాజు - వెంకటేశ్వరమ్మ దంపతులు కొడుకు హరీష్ రావుకు పెళ్లి చేయాలని నిర్ణయించి అమ్మాయి కోసం వెతుకుతున్నాయి. అయితే ఎంతకూ సంబంధం కుదరకపోవడంతో హరీష్ అసహనానికి లోనయ్యాడు. దీంతో పెళ్లి విషయమై తరచూ తల్లితో గొడవపడేవాడు. 

read more శ్రీకాకుళంలో దారుణం... కన్నతల్లిపై కత్తితో దాడిచేసిన కసాయి కొడుకు

ఈ క్రమంలోనే తల్లీ కొడుకుల మధ్య ఇటీవల మరోసారి పెళ్లి విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కన్నతల్లిపైనే క్రికెట్ బ్యాట్ తో దాడిచేసాడు. వెంకటేశ్వరమ్మ తలపై కొడుకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో భయపడిపోయిన హరీష్ తల్లిని అలాగే వదిలేని ఇంటితలుపులు మూసేసి పరారయ్యాడు. 

ఈ ఘటన తర్వాత చాలాసేపటికి ఇంటికి వచ్చిన చింతరాజు తలుపుతెరిచి చూడగా భార్య రక్తపుమడుగులో పడివుంది. దీంతో అతడు భార్యను చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలా కాసుల కోసం ఒకడు, పెళ్లి కోసం మరొకడు కన్నతల్లులను కడతేర్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios