Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు ఆదేశాల ఎఫెక్ట్: డాక్టర్ సుధాకర్ డిశ్చార్జీ, భార్యతో కలిసి ఇంటికి..

విశాఖ మానసిక వైద్యశాల నుంచి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జీ అయ్యారు. ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జీ కావడానికి వెసులుబాటు లభించింది.

Dr Sudhakar discharged from the Visakha hospital
Author
Visakhapatnam, First Published Jun 6, 2020, 6:37 AM IST

విశాఖపట్నం: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ ను విశాఖపట్నంలోని మానసిక వైద్యశాల వైద్యులు శుక్రవారం రాత్రి డిశ్చార్జీ చేశారు. ఆయనకు గత కొంత కాలంగా విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. డిశ్చార్జీ అయిన తర్వాత ఆయన భార్య మంజరితో కలిసి ఇంటికి వెళ్లారు.

కోర్టు ఆదేశాలు అందిన తర్వాత డాక్టర్ సుధాకర్ ఆస్పత్రి సూపరింటిండెంట్ కు లేఖ రాశారని, దాని ఆధారంగా డిశ్చార్జీ చేశారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. విశాఖ మానసిక వైద్యశాలలో అక్రమ నిర్బంధంలో ఉన్న తన కుమారుడిని హైకోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి లక్ష్మిబాయి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. 

డాక్టర్ సుధాకర్ రాష్ట్ర పోలీసుల కస్టడీలో లేరని, మెరుగైన వైద్యం కోసం విశాఖ మానసిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కావాలనుకుంటే కావచ్చుననని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సుధాకర్ ను తాము కస్టడీలోకి తీసుకోలేదని సిబిఐ తెలిపింది. ఈ స్థితిలో విశాఖ మానసిక వైద్యశాల నుంచి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జీ అయ్యేందుకు వీలు కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో సుధాకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. 

డాక్టర్ సుధాకర్ కు చికిత్స కొనసాగాల్సిన అవసరం ఉందని, వేరే ఆస్పత్రిలో చేర్పించాలని, మందులు తప్పనిసరిగా వాడేలా చూడాలని విశాఖ మానసిక వైద్యశాల వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. గతన నెల 16ల తేదీన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆస్పత్రిలో చేరారని వైద్యుల తెలిపారు. 

ఇదిలావుంటే, డాక్టర్ సుధాకర్ కేసు విచారణలో భాగంగా సిబిఐ అధికారులు శుక్రవారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ను విచారించారు. గంటకు పైగా ఎమ్మెల్యేతో మాట్లాడారు. కరోనా నివారణ చర్యలపై చర్చించేదుకు ఏప్రిల్ 6వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో ఏర్పటైన సమావేశానికి సుధాకర్ వచ్చినప్పుడు సుధాకర్ ప్రవర్తించిన తీరును అడిగినట్లు తెలిసింంది.

Follow Us:
Download App:
  • android
  • ios