పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమానవీయ ఘటన జరిగింది. ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమానవీయ ఘటన జరిగింది. ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెడితే ఏలూరుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడికి ఫేస్ బుక్ లో భూమి అనే ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పడింది. భూమి ట్రాన్స్ జెండర్ అని తెలిసే తారక ప్రేమలో పడ్డాడు. కొద్దికాలం ప్రేమాయణం తరువాత ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు.

పెళ్లైన కొద్ది రోజులకు భూమిని నువ్వు నాకు వద్దని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భూమి పోలీసులను ఆశ్రయించింది. తారక ఏలూరు సత్రంపాడుకు చెందిన వ్యక్తి. కాగా భూమి హైదరాబాద్ ఎల్ బీ నగర్ నివాసి. వీరిద్దరూ 2020 జనవరిలో పెళ్లి చేసుకున్నారు.

ఆ తరువాత కొత్త కాలానికి వీరి మధ్య చిన్నపాటి వివాదం మొదలయ్యింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో యువకుడు భూమితో ఉండేందుకు నిరాకరించటంతోపాటు, భూమిని అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగాడు. దీంతో భూమి ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తారకను అరెస్ట్ చేశారు.