నగలకోసం దుండగులు దారుణానికి తెగించారు. డాక్టర్ భార్య మీద దాడిచేసి.. గొంతుకోసి.. ఆమె నగలతో ఉడాయించారు. ఈ ఘటన బందరులో జరిగింది. 

కృష్థా జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని కృష్థా జిల్లా బందరులో దారుణ ఘటన వెలుగు చూసింది. నగల కోసం డాక్టర్ భార్యను దారుణంగా హత్య చేశారు. రాధ గొంతు కోసి, ఆమె ఒంటిపై నగలతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన స్థానిక వెంకటేశ్వర పిల్ల ఆస్పత్పిలో జరిగింది. వెంకటేశ్వర పిల్లల ఆస్పత్రిని డాక్టర్ మహేశ్వరరావు నడుపుతున్నారు. ఆస్పత్రిలోకి ప్రవేశించిన దుండగులు మహేశ్వరరావు భార్య కళ్లలో కారం కొట్టి, రాడ్డతో దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత నగలతో పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిమీద విచారణ నిమిత్తం డాక్టర్ మహేశ్వరరావును కూడా స్టేషన్ కు తరలించారు. అతని దగ్గరున్న సెల్ ఫోన్లు తీసుకున్నారు. అయితే విచారణ సమయంలో సెల్ ఫోన్ ఇవ్వాలంటూ మహేశ్వరరావు పట్టుబట్టాడు. దీంతో ఆయన ప్రవర్తన మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిమీద మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred