Asianet News TeluguAsianet News Telugu

రూ.10 వేలు ఇస్తేనే పోస్ట్‌మార్టం .. తేల్చేసిన డాక్టర్లు : మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అమానుషం

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో డ్యూటీలో వున్న డాక్టర్లు దారుణంగా ప్రవర్తించారు. పోస్ట్‌మార్టం చేయాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనంటూ తేల్చిచెప్పారు. 
 

doctors demand bribe in machilipatnam govt hospital for postmortem ksp
Author
First Published May 31, 2023, 6:20 PM IST | Last Updated May 31, 2023, 6:20 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అమానుషం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిపోయి ప్రవర్తించారు ఇద్దరు డాక్టర్లు. మచిలీపట్నానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే అతడి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయాలంటే రూ.10 వేలు లంచం అడిగారు డాక్టర్లు. ఆర్ఎంవో మహేశ్, డాక్టర్ ఆంజనేయులు. డబ్బులిస్తేనే గానీ పోస్ట్‌మార్టం చేసేది లేదని చెప్పడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. డాక్టర్లు కూడా లేకపోవడంతో పోస్ట్‌మార్టం గది దగ్గరే పడిగాపులు కాస్తున్నారు మృతుడి బంధువులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios