డాక్టర్ల నిర్లక్ష్యమా, లేదా అనికోకుండా జరిగిన అనివార్య సంఘటనా అనేది పక్కనపెడితే... కర్నూల్ జిల్లా నంద్యాల మెటర్నిటీ ఆసుపత్రి వైద్యులు ఒక మహిళకు డెలివరీ చేస్తూ బిడ్డ తలను కోసేశారు. డాక్టర్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే.... కర్నూల్ జిల్లా మిడుతూరు మండలం, అలగనూరుగ్రామానికి చెందిన శశి కళ నొప్పులు రావడంతో నంద్యాల మెటర్నిటీ ఆసుపత్రిలో చేరింది. బిడ్డ అడ్డం తిరిగిందని ఆపరేషన్ చేసి మాత్రమే బిడ్డను బయటకు తీయడం శ్రేయస్కరమని ఆ సదరు మహిళకు, వారి బంధువులకు చెప్పారు ఆసుపత్రి వైద్యులు. అందుకు ఆ మహిళా తరుఫు వారు కూడా అంగీకరించారు. 

ఆ తరువాత ఆ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. డాక్టర్ల కథనం ప్రకారం బిడ్డ ఎదురు కాలతో పుట్టినందున తమకు వేరే ఎటువంటి ఆప్షన్ లేక, తల్లినైనా బ్రతికించాలనే ఉద్దేశంతో గత్యంతరం లేక చిన్నారి తలను కోసేయాల్సి వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఆ మహిళా తరుఫు బంధువులు మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ ఆసుపత్రి వర్గాలు బిడ్డ శరీరాన్ని తీయగలిగినప్పటికీ.... తలను ఎం,ఆత్రం తీయలేకపోయాయి. 

ప్రస్తుతం ఆ మహిళ గర్భశ్రయంలో తల అలాగే ఉండడంతో మహిళకు తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆ మహిళను కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ ఆపరేషన్ చేస్తున్నారు. 

మహిళ భర్త మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మహిళా చనిపోయిందని ఆరోపించాడు. డాక్టర్ల నిర్లక్ష్యమా లేదా గత్యంతరం లేక చేశారా అనేది పక్కకు పెడితే.... ఒక పసిగుడ్డు బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే మరణించింది మాత్రం వాస్తవం. 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఈ ఒక్క రోజే పది మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ సోకిన డాక్టర్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటి ఓ ప్రైవేట్ డాక్టర్ కరోనా వైరస్ తో మరణించిన విషయం తెలిసిందే. 

తాజాగా నమోదైన పది కేసులో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 184కు చేరుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం డాక్టర్ కరోనా వైరస్ తో మరణించాడు. అతని వద్ద చికిత్స పొందినవారు, వైద్య సిబ్బంది కలిపి మొత్తం 213 ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఉండగా, వారికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 250 మంది సెకండరీ కాంటాక్టు కేసులకు సంబంధించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.