విద్యుత్ కోతలపై ఆ వదంతులను నమ్మవద్దు.. ఈపిడిసిఎల్

దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా power cut ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేశారు. 

Do not believe the rumors on power cuts : EPDCL

విశాఖపట్నం : విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు.

దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా power cut ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గు నిల్వలను రాష్ట్రప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు. 

Power supply పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా Social media ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు.

కాగా, శుక్రవారం నాడు వచ్చిన వార్తల ప్రకారం.. కడప Rtppలో బొగ్గు కొరత కారణంగా నాలుగు యూనిట్లలో  670 మెగావాట్ల electricity ఉత్పత్తి అవుతుంది.  ఈ ప్లాంట్‌లో మొత్తం ఆరు విద్యుత్ యూనిట్లున్నాయి. అయితే నాలుగు యూనిట్లలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి సాగుతుంది.ఆర్టీపీపీకి 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. అయితే Coal కొరతతో నాలుగు యూనిట్లలోనే విద్యుత్ ఉత్పత్తి సాగుతుంది.

బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు థర్మల్ పవన్ స్టేషన్లలో సామర్ధ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి సాగడం లేదు. అయితే థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన బొగ్గును సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించిందిఅయితే దేశంలోని పలు రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గు సరఫరా కోసం కేంద్రం చర్యలు తీసుకొంది. 

మరో వైపు  తమ కోటా నుండి విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ ను సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ వినియోగదారులకు విద్యుత్ ను సరపరా చేయకుండా విద్యుత్ ను విక్రయిస్తే చర్యలు తీసుకొంటామని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది.

తమ రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లకు రోజుకు 20 ర్యాక్స్ బొగ్గును సరఫరా చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల కోరింది.  రాష్ట్రంలో 5010 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత కారణంగా 2,300 మెగావాట్ల నుండి 2500 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి జరుగుతుంది.

‘‘ జగనన్న కొవ్వొత్తి-అగ్గిపెట్టె పథకం’’ తెస్తారేమో: ఏపీలో విద్యుత్ సంక్షోభంపై రఘురామ సెటైర్లు

ఆర్టీపీపీలోని రెండు యూనిట్లు మూసివేశారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ లో ఒక యూనిట్ మూసివేశారు. నార్లతాతారావు పవర్ స్టేషన్ లో సామర్ధ్యం కంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బొగ్గు కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు.

బొగ్గు కొరత కారణంగా యూవిట్ విద్యుత్ ధర రూ.4.50 ల నుండి రూ. 20 లకు పెరిగిందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. గత ఏడాది అక్టోబర్ మాసంలో ఏపీ రాష్ట్రంలో 160 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేది. అయితే ప్రస్తుతం విద్యుత్ వినియోగం రోజుకు 190 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయితే బొగ్గు కొరత కారణంగా థర్మల్ పవర్ స్టేషన్లలో సామర్ధ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి సాగడం లేదు. దీంతో విద్యుత్ ను పొదుపుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios