లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోస్.. 41ఏ నోటీసులు ఇవ్వమని ఆదేశించిన హైకోర్టు...
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోస్ చేసింది.

అమరావతి : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోస్ చేసింది. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోస్ చేస్తున్నట్లు హోకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు, లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని కోర్టు చెప్పింది. దీంతో 41ఏ నోటీస్ ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. సిఐడి విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో లోకేష్ కు సిఐడి బృందం నోటీసులు ఇవ్వనుంది. ఈ కేసులో లోకేష్ ఏ14గా ఉన్నారు. ఇప్పుటికే సిఐడీ బృందం ఢిల్లీ వెళ్లింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.