కర్నూలు: ఎర్రమట్టి తవ్వకం విషయంలో శ్రీశైలం శాసనసభ్యుడు బుద్దా రాజశేఖర్ కు, మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

మట్టి అమ్మకం విషయంలో బుద్దా రాజశేఖర్, అఖిలప్రియ పోటీ పడుతున్నారు. వాహనాలపై తమ తమ నాయకుల పేర్లతో కూడిన స్టిక్కర్లు అతికించి మరీ తవ్వకాలు చేపట్టి అమ్ముతున్నారు. 

మహనంది మండలంలో అక్రమ తవ్వకాల ఆరోపణలపై విజిలెన్స్ శాఖ మంత్రి అఖిలప్రియ అనుచరులను కొంత మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మహానంది నంద్యాలకు సమీపంలో ఉంటుంది.

ఇటుకల తయారీకి వాడే విలువైన ఎర్రమట్టి మహానందిలో బయటపడింది. ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర రెడ్డి అనుచరులు పెద్ద యెత్తున మట్టి తవ్వకాలను చేపట్టినట్లు చెబుతారు. దీంతో అఖిలప్రియ అనుచరులు కూడా ఇటీవల ఆ కార్యక్రమంలోకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పొడసూపాయి.