Asianet News TeluguAsianet News Telugu

అనంత టీడీపీలో' జేసీ' చిచ్చు: తాడిపత్రిలో ప్రభాకర్ చౌదరి కౌంటర్ కార్యక్రమాలు

టీడీపీకి చెందిన అనంతపురం జిల్లా నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. జేసీ వర్గీయులకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీకి వైరి వర్గంగా ఉన్న టీడీపీ నేతలను ప్రభాకర్ చౌదరి కలిసి రావడం చర్చకు దారి తీసింది.

Differences out in the open in Tadipatri Telugu Desam
Author
Anantapur, First Published Oct 3, 2021, 10:09 AM IST

అనంతపురం:  టీడీపీ కి (tdp)చెందిన  అనంతపురం  (anatapur)జిల్లా నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. జేసీ (jc prabhakar reddy, jc diwakar reddy) సోదరులకు  టీడీపీ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ ప్రభాకర్ చౌదరి కౌంటర్ ఇవ్వడంతో ఈ విబేధాలు తాడిపత్రికి వ్యాపించాయి.ప్రభాకర్ చౌదరి (prabhakar chowdary)కి  జేసీ సోదరులకు మధ్య చాలా కాలంగా పొసగడం లేదు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ను ప్రభాకర్ చౌదరికి సంబంధం లేకుండానే జేసీ వర్గీయులు  కలిసేవారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం జేసీ వర్గీయులు తనను  కలుపుకొనిపోయేవాళ్లు కాదని ప్రభాకర్ చౌదరి పలుమార్లు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రభాకర్ చౌదరి అమ్వే అనే స్వచ్ఛంధ సంస్థను నడుపుతున్నాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో  శుక్రవారం నాడు తాడిపత్రి నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో  ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఏ రాజకీయ నేత అయినా , సంస్థ అయినా తాడిపత్రిని సందర్శించవచ్చని వారికి తాము మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని  తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.

షాదీఖానాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభాకర్ చౌదరి వికలాంగులకు  ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత జేసీ సోదరులతో విబేధాలున్న టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు ప్రభాకర్ చౌదరి.ఇదిలా ఉంటే పెద్దవడుగూరు మండలంలోని జాతీయ ఉపాధి హామీ పథకం కింద  బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. హైకోర్టు ఆదేశించినా కూడ  బిల్లులు చెల్లించలేదని  ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు.ఎంపీడీఓ సహా ఇతర అధికారులు పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనను విరమించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios