Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బీజేపీలో రచ్చ: కన్నా కుర్చీకి ఎసరు, వ్యతిరేక వర్గం సమావేశం

రాజధాని విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్ట్రాటజీ కమిటీలో కన్నా వ్యతిరేకులు ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకులను కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చాలా విషయాలలో కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 
 

Differences in AP BJP: meeting against bjp chief kanna laxminarayana
Author
Hyderabad, First Published Aug 31, 2019, 2:20 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వ్యవహార శైలిపై కొందరు నేతలు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. కన్నా వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ లో ఏపీ బీజేపీ నేతలు వాడీవేడిగా సమావేశమయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆయన వర్గీయులతో మేథోమథనం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో స్ట్రాటజీ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. 

రాజధాని విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్ట్రాటజీ కమిటీలో కన్నా వ్యతిరేకులు ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకులను కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చాలా విషయాలలో కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 

ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో జరుగుతున్న మేథోమథనం సమావేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి సుధీష్ రాంభోట్ల. కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో జరుగుతున్న భేటీ ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఆరోపించారు. 

కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారశైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని సుధీష్ రాంభోట్ల స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యాలయం స్ట్రాటజీ కమిటీ సమావేశమని ఈ సమావేశం పార్టీకి సంబంధించినదని చెప్పుకొచ్చారు. 

సుధీష్ రాంభోట్ల నేతృత్వలో జరిగిన ఈ సమావేశానికి మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులతోపాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలవరం, అమరావతి, వైసీపీ ప్రభుత్వం పనితీరుపై చర్చించినట్లు తెలుస్తోంది. 

అయితే బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో ఏర్పాటు చేసిన మేథోమథనం సదస్సుకు పిలవకపోవడంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వ్యూహాత్మకంగా సమావేశం నిర్వహించారంటూ ప్రచారం జరుగుతోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios