అమరావతి : మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. ఇటీవల కరోనా చికిత్స కోసం నగరంలోని ఆయుష్ హాస్పటల్ లో నరేంద్ర చేరిన విషయం తెలిసిందే. 

బుధవారం కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో నరేంద్రను తిరిగి సెంట్రల్ జైలుకు పోలీసులుతరలిస్తున్నారు. వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు నరేంద్రకు విజ్ఞప్తి చేశారు. 

అయితే జైల్లోనే ప్రత్యేక ఇసాలేషన్ లో ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ : ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు...

కాగా, సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. 

నరేంద్ర ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.