Asianet News TeluguAsianet News Telugu

డోన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

రాజకీయంగా హేమాహేమాలను దేశానికి అందించింది డోన్. రాష్ట్రపతిగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా, సీఎంగా, ఎంపీగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి డోన్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. మరో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా డోన్ నుంచే ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్రంలోని వీఐపీ, హైప్రొఫెల్ నియోజకవర్గాల్లో ఒకటిగా డోన్ పేరు తెచ్చుకుంది. నంద్యాల లోక్‌సభ పరిధిలోకి వచ్చే డోన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బేతంచర్ల, డోన్, ప్యాపిలీ మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,19,679 మంది. బోయ సామాజికవర్గం ఇక్కడ రాజకీయాలను శాసిస్తోంది. తర్వాత ముస్లిం, యాదవ, దళిత, రెడ్డి, గౌడల్లోని ఈడిగ వర్గాలు బలమైనవి. మరోసారి డోన్‌లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని బుగ్గన పట్టుదలతో వున్నారు. టీడీపీ నుంచి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి బరిలో దిగుతున్నారు.

Dhone Assembly elections result 2024 ksp
Author
First Published Mar 21, 2024, 4:14 PM IST

ఉమ్మడి కర్నూలుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నియోజకవర్గాల్లో డోన్ ఒకటి. రాజకీయంగా హేమాహేమాలను దేశానికి అందించింది డోన్. రాష్ట్రపతిగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా, సీఎంగా, ఎంపీగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి డోన్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. మరో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా డోన్ నుంచే ప్రాతినిథ్యం వహించారు. కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి రాజకీయ దురంధరులు డోన్‌ నుంచి గెలిచి ఉన్నత పదవులు అధిరోహించారు. అలా రాష్ట్రంలోని వీఐపీ, హైప్రొఫెల్ నియోజకవర్గాల్లో ఒకటిగా డోన్ పేరు తెచ్చుకుంది. నంద్యాల లోక్‌సభ పరిధిలోకి వచ్చే డోన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బేతంచర్ల, డోన్, ప్యాపిలీ మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,19,679 మంది. 

డోన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. ఉద్ధండులను దేశానికి అందించిన గడ్డ :

బోయ సామాజికవర్గం ఇక్కడ రాజకీయాలను శాసిస్తోంది. తర్వాత ముస్లిం, యాదవ, దళిత, రెడ్డి, గౌడల్లోని ఈడిగ వర్గాలు బలమైనవి. 1952లో ఏర్పడిన డోన్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ , టీడీపీలు తమ కంచుకోటగా మార్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు మూడు సార్లు ఇక్కడ గెలిచారు. గతంలో కేఈ కృష్ణమూర్తి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాల మధ్య డోన్‌లో ఆధిపత్య పోరు నడిచింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి 1,00,845 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కేఈ ప్రతాప్‌కు 65,329 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 35,516 ఓట్ల తేడాతో బుగ్గన గెలిచారు.

డోన్ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై బుగ్గన కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే మరోసారి డోన్‌లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని బుగ్గన పట్టుదలతో వున్నారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడం ఆర్ధిక మంత్రిగా, సౌమ్యుడిగా, వివాదరహితుడిగా వున్న మంచిపేరు తనను గెలిపిస్తుందని రాజేంద్రనాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి బరిలో దిగుతున్నారు. కోట్ల ఫ్యామిలికి వున్న బ్రాండ్ ఇమేజ్, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను గెలుస్తానని సూర్యప్రకాశ్ రెడ్డి చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios