Asianet News TeluguAsianet News Telugu

స్థానిక ఎన్నికలు : పరిస్థితులు కంట్రోల్ లోనే ఉన్నాయి.. అన్ని ఏర్పాట్లూ చేశాం : గౌతమ్ సవాంగ్

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ పరిస్ధితులు కంట్రోల్ లో ఉన్నాయని తెలిపారు. పరిస్థితులకు తగ్గట్టుగా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. 

dgp gowtham sawang comments on local body elections - bsb
Author
hyderabad, First Published Feb 6, 2021, 2:33 PM IST

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ పరిస్ధితులు కంట్రోల్ లో ఉన్నాయని తెలిపారు. పరిస్థితులకు తగ్గట్టుగా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. 

క్షేత్రస్ధాయిలో తగు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీలలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయని, నాలుగు విడతలుగా ఈ ఎన్నికలు జరుగుతాయని. ఇవన్నీ  వెంట వెంటనే జరుగుతాయని తెలిపారు.

ఎలక్షన్ల కోసం బైటినుంచి ఎలాంటి రక్షణ సిబ్బంది రావడంలేదని ఈ సందర్భంగా తెలిపారు. 655 మండలాల్లో13,133 పంచాయితీలు, 130,749 వార్డులు, 135,852 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. వీటిల్లో 6254 తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు, 8555 సమస్యాత్మక ప్రాంతాలు, 983 చాలా సమాజ వ్యతిరేక శక్తులు ఉన్న ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. 

పంచాయతీ ఎన్నికల నేపత్యంలో అనధికారిక ఆయుధాలు, అధికారి ఆయుధాలు సీజ్ చేస్తామని తెలిపారు. 9199 ఆయుధాలు ఇప్పటికీ మాకు డిపాజిట్ అయ్యాయన్నారు. మద్యం, నగదు రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు ఉంటాయని పేర్కొన్నారు. 

కొడ్ ఆఫ్ కండక్ట్ తప్పిన వారిపై నిఘా కోసం ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. స్పెషల్ బ్రాంచ్, డయల్ 100, కాల్ సెంటర్లు, డ్రోన్లు, బాడీ వార్మ్ కెమెరాలు వాడతామన అన్నారు.

వీటన్నింటితో పాటు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు సోషల్ మీడియా వాచ్ కూడా జరుగుతుందని తెలిపారు. మీడియా లో వచ్చే వార్తల ఆధారంగా కూడా పరిశీలిస్తామన్నారు. 

ఇప్పటివరకు 147391 బైండ్ ఓవర్, 12779 సెక్యూరిటి కేసులు చేశామని చెప్పుకొచ్చారు. వీటితో పాటు 1122 రూట్ మొబైల్స్, 199 మొబైల్ చెక్ పోస్టులు, 9 ఎస్పీ రిజర్వు, 9 అడిషనల్ ఎస్పీ రిజర్వ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎలక్షన్లకు ముందు 44 నేరాలు జరిగాయని చెప్పుకొచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios