జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యతపై పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని దేవినేని ఉమ విమర్శించారు. పోలవరం పనుల్లో నాలుగు రకాల క్వాలిటీ చెకింగ్ జరుగుతోందన్నారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యతపై పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని దేవినేని ఉమ విమర్శించారు. పోలవరం పనుల్లో నాలుగు రకాల క్వాలిటీ చెకింగ్ జరుగుతోందన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ అంశంలో పవన్ కళ్యాణ్ కు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత పవన్, జగన్‌కు లేదని చెప్పారు. సర్ అర్థర్ కాటన్ లాంటి మహానుభావులకే విమర్శలు తప్పలేదన్నారు. బీజేపీ నాటకంలో పవన్, జగన్ పాత్రధారులు అని ఆరోపించారు. బీజేపీ ఆడమంటే పవన్, జగన్ లు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
