Asianet News TeluguAsianet News Telugu

అసలీ లంకారెడ్డి ఎవరు? ఆ కాంట్రాక్ట్ ఆయనకే ఎందుకంటే: జగన్ పై ఉమ ఫైర్

తెలుగుదేశం హయాంలో చేసిన పనులు చూపి  వైసీపీ ప్రభుత్వం తాము చేసినట్లుగా జబ్బలు కొట్టుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. 

Devineni Uma Shocking Allegations on CM Jagan
Author
Vijayawada, First Published Jun 1, 2020, 7:38 PM IST

అమరావతి: వైసీపీ మేనిఫెస్టో పై సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా? అని మాజీ మంత్రి శ్రీ దేనినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పి.. మడమ అష్ట వంకర్లు తిప్పారని ఎద్దేవా చేశారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వెలుగొండ ప్రాజెక్టులో  కేవలం 600మీటర్ల పనులు మాత్రమే జరగాయని ట్వీట్ చేశారని ఆరోపించారు. తెలుగుదేశం హాయంలో జరిగిన పనులు రూ.63,370 కోట్లు అయితే వైసీపీ వాళ్లు రూ. 56,700కోట్లు అవినీతి జరిగిందని నోటికి వచ్చినట్లు కారు కూతలు కుస్తున్నారని మండిపడ్డారు.  

తెలుగుదేశం హయాంలో చేసిన పనులు చూపి  వైసీపీ ప్రభుత్వం తాము చేసినట్లుగా జబ్బలు కొట్టుకుంటోందని ఆరోపించారు. పోలవరంకు సంబంధించిన సమాచారం ఎందుకు అన్ లైన్ లో పెట్టడం లేదని నిలిదిశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు 25సార్లు, ఇరిగేషన్ మంత్రిగా తాను 70సార్లు పోలవరం ను సందర్శించామని తెలిపారు. దమ్ము ధైర్మం ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇరిగేషన్  మంత్రి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం బయట పెట్టాలని ఉమ డిమాండ్ చేశారు. 

''పులిచింతల ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. వెలుగొంగ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత ఖర్చు చేశారు? రివర్స్ టెండరింగ్ పేరుతో మీ కాంట్రాక్టర్లకు  ఇచ్చారు... అసలు లంకారెడ్డి ఎవరు? లంకారెడ్డి కడప జిల్లా అని కాంట్రాక్టు  ఇచ్చారా లేదా మీ బంధువని కాంట్రాక్టు ఇచ్చారా? లేదా గిన్నిస్ బుక్ లో పని చేసినందుకు ఇచ్చారా?  ఏవిధంగా ఇచ్చారు. నామినేషన్ల మీద వర్క్ లు ఇవ్వడానికి కారణం ఏంటి?'' అని నిలదీశారు. 

'' ప్రశ్నించిన వారిపై బూతుల మంత్రులతో బూతులు తిట్టించడం కాదు..సమాధానాలు కావాలి. ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజలు తరుపున అడుగుతున్నాను.  తెలుగుదేశం హాయాంలో దాదాపు రూ.65కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రివర్స్ టెండరింగ్ అంటే నామినేషన్ పై కాంట్రాక్టు ఇవ్వటమా. కడప జిల్లాలో రివర్స్ టెండరింగ్ పేరుతో కేవలం మూడు పనులు జరుగుతున్నాయి..అవి కూడా జగన్మోహన్ రెడ్డి మేనమామ, వైసీపీ ఎంపీ, మంత్రి చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

read more  నేను చచ్చేంత వరకు వైసిపిలోనే... జగన్ వెంటే: విజయసాయి రెడ్డి

''ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశారు. టెనాల్ 1పై ఎందుకు రివర్స్ టెండరింగ్ వెళ్లలేదు? టెనాల్ 2పై ఎందుకు వెళ్లారు.? అవినీతి ఎంత జరిగిందో చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి హాయాంలో, తరువాత కాలంలో ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాలంలో ఎంత పనులు జరిగాయి. అలాగే తెలుగుదేశం హాయాంలో ఎంత పనులు జరిగాయో జగన్మోహన రెడ్డి సమాధానం చెప్పాలి'' అని అడిగారు. 

''రూ.3వేల కోట్లు ధర స్థీరీకరణ నిధి కింద ఎంత ఖర్చు చేశారు?ఎక్కడా ఖర్చు చేశారో సమాధానం కావాలి. పులివెందులు అరటిపండ్లు తీసుకొచ్చి మార్పింగ్ చేయడమే మీ పనా? కేంద్రం నుంచి తెచ్చిన రూ.70వేల కోట్లు ఏమి చేశారు? ఎక్కడ ఖర్చుచేశారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేవాళ్లం'' అన్నారు. 

''వైసీపీ 22 మంది ఎంపీలను పెట్టుకొని పోలవరం కు కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడం చేతకాలేదు. ప్రజలు కట్టిన పన్నులకు జమ ఖర్చులు చెప్పాలి. రివర్స్ టెండరింగ్ పేరుతో మీ బినామీలకు, కాంట్రాక్టులకు పనులు ఇవ్వవద్దు'' అని దేవినేని ఉమ సూచించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios